హైదరాబాద్: 28°C
వార్తలు

తణుకులో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

W.G: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం తణుకులో ఘనంగా నిర్వహించారు. పాతవూరు అరుంధతి యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో TDP ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి లాజర్ పాల్గొని ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేశారు.