హైదరాబాద్: 28°C
వార్తలు

గుండ్లపోచంపల్లిలో 'వన్ డే–వన్ వార్డ్' తనిఖీ

HYD: 'వన్ డే–వన్ వార్డ్' కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జోనల్ కమిషనర్ గుమ్మాల శ్రీజన గుండ్లపోచంపల్లి వార్డును సందర్శించారు. రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, దోమల నివారణ, వీధికుక్కల నియంత్రణ తదితర సమస్యలను పరిశీలించి, సంబంధిత శాఖలు ప్రాధాన్యంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.