హైదరాబాద్: 28°C
వార్తలు

బ్యాంకులో బారులు తీరిన రైతులు

ADB: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బ్యాంకులో బారులు తీరి, తమ ఖాతాల్లో జమైన రైతు భరోసా డబ్బులను విత్ డ్రా చేసుకున్నారు.