హైదరాబాద్: 28°C
వార్తలు

కడియం–కొండా వివాదం.. కాంగ్రెస్‌లో మరోసారి చర్చ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ కమిషనర్‌తో ఆలయాలపై సమీక్ష నిర్వహించడంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం ఈవ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీసి, హైకమాండ్‌కు పంపిన లేఖను బహిర్గతం చేయవద్దని మంత్రికి సూచించారు. మంత్రి లేఖ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.