SS: తనకల్లు మండలంలోని ఎర్రగుంటపల్లి బస్ స్టాప్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో పీటీఎం మండలం కమ్మవారిపల్లికి చెందిన వెంకటరమణ (68) మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం,ఆర్టీసీ బస్సు నుంచి దిగి రోడ్డు దాటుతుండగా అనంతపురం వైపు నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
ఎర్రగుంటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వృద్ధుడి మృతి


