హైదరాబాద్: 28°C
వార్తలు

గాంధీ భవన్‌లో రేపు మంత్రి వివేక్‌తో ముఖాముఖి

HYD: రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గాంధీ భవన్‌లో జరిగే "మంత్రులతో ముఖాముఖి" కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.