హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస మహోత్సవాలపై సమీక్ష

AP: ఈనెల 15 నుంచి ఆగస్టు 12 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస మహోత్సవాలు నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ప్రతిరోజూ దుర్గమ్మకు పంచవారాహి మంత్రాలతో విశేష పూజలు, హోమాలు జరపనున్నారు. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు శాకంభరీ దేవి మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈనెల 15న ఆలయ అధికారులు తొలిసారె సమర్పిస్తారు. ఆగస్టు 12న ఉత్సవాల ముగింపు రోజున అర్చకులు సారె సమర్పించనున్నారు.