హైదరాబాద్: 28°C
వార్తలు

పశువులకు ఉచిత టీకాల పంపిణీ

NGKL: బిజినేపల్లి కల్వకుంట తండాలో మంగళవారం పశువులకు ఉచిత నివారణ టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ సరోజ మాన్య నాయక్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో వెటర్నరీ వైద్యురాలు జ్యోతి పశువులకు టీకాలు వేశారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి పశువులను రక్షించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.