హైదరాబాద్: 28°C
వార్తలు

గుడ్ న్యూస్.. మహిళలకు నెలకు రూ.2,500

మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మహిళా సమృద్ధి యోజనను రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 28న లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పథకం కింద, అర్హులైన మహిళలకు ప్రతి నెల రూ.2,500 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.