హైదరాబాద్: 28°C
వార్తలు

వయనాడ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. కొంతమంది కార్మికులను రక్షించాయి. వయనాడ్‌లో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనక్కంపొయిల్ - కల్లాడి సొరంగం నిర్మాణ పనుల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.