హైదరాబాద్: 28°C
వార్తలు

తుంగభద్ర డ్యామ్‌కు వరద ప్రవాహం

AP: ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లాలోని తుంగభద్ర డ్యామ్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. 4,650 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1588.37 అడుగులు ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.725 టీఎంసీలు ఉంది.