హైదరాబాద్: 28°C
వార్తలు

'తొలగించిన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలి'

ASR: గురుకుల విద్యా సంస్థల్లో పని చేసిన 488మంది, EMRS పాఠశాలల్లో పని చేసిన సుమారు 100మంది ఉపాధ్యాయులను తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఇవాళ సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్స అధికారులను కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కొనసాగుతోందన్నారు. మరోవైపు EMRS టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం అన్యాయమన్నారు.