హైదరాబాద్: 28°C
వార్తలు

17న తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం

దేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈనెల 17న ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్, సోనిపత్ మధ్య నడిచే ఈ రైలు, కాలుష్యాన్ని వెలువరించని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. భారతీయ రైల్వే ఈ హైడ్రోజన్ రైలు ఛార్జీని అత్యంత సరసమైనదిగా తీసుకొస్తుంది. టికెట్ ధరలు రూ.5 నుంచి రూ.25 మధ్య ఉంటాయి. ఈ రైలులో సుమారు 2500 మంది సామర్థ్యం ఉంటుంది.