మహారాష్ట్ర పుణే జిల్లా లోనావాలో వర్షం బీభత్సం సృష్టించింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 67 సెం.మీ.(670 మి.మీ) వర్షపాతం నమోదైంది. భిరా, తంహిని, షిర్గాన్, అంబోన్, ఖోపోలి ఏరియాల్లో 500 మి.మీ. కంటే ఎక్కువగా నమోదైంది. భారీ వర్షపు నీరంతా ఉధృతంగా భీమా నదిలోకి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
వార్తలు
రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు


