హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్వాడీ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ASR: చింతూరు డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 108 పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 2 అంగన్వాడీ వర్కర్, 2 మినీ అంగన్వాడీ వర్కర్, 104 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నోక్వాల్ సూచించారు.