హైదరాబాద్: 28°C
వార్తలు

'బంగారు పూత ఉన్న పుస్తకం మిస్ కాలేదు'

అయోధ్య రామాలయానికి బహుమతిగా వచ్చిన రూ.5 కోట్ల విలువైన 'రామ్‌చరిత్‌మానస్' పుస్తకం మిస్సైందన్న ఆరోపణలపై రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ స్పందించింది. ఆ బంగారు పూత కలిగిన పుస్తకాన్ని మీడియా ముందు ప్రదర్శించింది. విరాళంగా వచ్చిన 2వేలకు పైగా వస్తువులకు రిజిస్టర్ మెయింటెన్ చేస్తున్నామని, భక్తులకు అనుమానాలు ఉంటే ట్రస్టును సంప్రదించి చెక్ చేసుకోవచ్చని సూచించింది.