హైదరాబాద్: 28°C
వార్తలు

ముంబైని ముంచెత్తిన వర్షాలు.. బీఎంసీ హై అలర్ట్!

ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో జనజీవనం స్తంభించింది. తూర్పు శివారు ప్రాంతాల్లో 48 గంటల్లో ఏకంగా 380 మి.మీ. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఎంసీ యంత్రాంగం అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించింది. బాధితులు సహాయం కోసం 1916 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.