హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి శ్రీవారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు

KDP: బద్వేల్ పట్టణం సిద్ధపటం రోడ్డులోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర, ఆంజనేయస్వామి ఆలయాల్లో ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వల్లంకొండ వెంకటరమణ తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.