SRCL: సిరిసిల్ల పట్టణంలో జనావాసాలు, ప్రధాన రహదారులపై పందులను వదిలేయడంపై మున్సిపాలిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో పెంపకందారులకు నోటీసులు జారీ చేసి, రెండు రోజుల్లోగా పందులను కేటాయించిన స్థలానికి తరలించాలని ఆదేశించింది. గడువులోగా తరలించకపోతే నిబంధనల ప్రకారం పందులను నిర్మూలించడంతో పాటు కేటాయించిన స్థలాన్ని కూడా తీసుకుంటామన్నారు.
వార్తలు
జనావాసాల్లో పందులు వద్దు.. కమిషనర్ హెచ్చరిక


