హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వడ్డీ జమ ప్రారంభం

దేశంలోని 8 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల EPF డిపాజిట్లపై 8.25% వడ్డీని ఖరారు చేసింది. వడ్డీని చందాదారుల ఖాతాల్లో డిపాజిట్ చేయాలని ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలిచ్చింది. దీంతో కొన్ని రోజుల్లోనే EPF సభ్యులందరి ఖాతాలో నగదు జమ కానుంది. వరుసగా మూడో ఏడాది 8.25% వడ్డీ రేటును EPFO కొనసాగించింది.