హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాక్టర్‌ను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

SRCL: ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామానికి చెందిన మంద బిక్షపతి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా రోడ్డుపక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు గుర్తించి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.