WNP: వ్యక్తిపై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేశామని గ్రామీణ ఠాణా ఎస్సై హృషికేశ్ తెలిపారు. మండలంలోని చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్యకు అతని అన్న మశన్నతో గొడవలు ఉన్నాయి. కృష్ణయ్య పొలం వద్ద ఉన్న సమయంలో మశన్న, అతడి భార్య శేషమ్మ, కుమారుడు అశోక్ ముగ్గురు కలిసి అసభ్యంగా తిడుతూ దాడి చేసి గాయపరిచారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
వార్తలు
దాడి ఘటనపై కేసు నమోదు..


