హైదరాబాద్: 28°C
వార్తలు

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

SRCL: తంగళ్లపల్లి మండలం ఇంద్రనగర్ గ్రామంలో దోగ్గల వేణు - పద్మ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. తమ సొంత ఇంటి కలను సాకారం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ దేవేంద్ర వెంకన్న, ఉపసర్పంచ్ నాగరాజ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.