W.G: పెంటపాడు మండలం రాచర్ల కాలువ గట్టున సెప్టిక్ ట్యాంక్ మురుగు, వ్యర్ధాలను వేస్తున్న పలువురిని స్థానికులు అడ్డగించారు. తాడేపల్లిగూడెం మండలం కడియ గ్రామానికి చెందిన జాలాది రమణకు చెందిన సెప్టిక్ ట్యాంకుగా గుర్తించారు. సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాల వల్ల కాలువ కలుషితమవుతుందని, దాని నుంచి వచ్చే దుర్వాసన వల్ల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వార్తలు
సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు.. స్థానికులు అడ్డగింపు


