హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండోనేషియా పర్యటన.. మోదీకి ఘనస్వాగతం

ప్రధాని మోదీ ఇండోనేషియా పర్యటన అట్టహాసంగా సాగుతోంది. జకార్తా చేరుకున్న మోదీ విమానానికి ఇండోనేషియా వైమానిక దళం ఫైటర్ జెట్లతో ప్రత్యేక ఎస్కార్ట్ ఇచ్చి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా స్వాగతించింది. విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల రక్షణ, ఆర్థిక బంధాన్ని బలపరిచే కీలక ద్వైపాక్షిక చర్చలు ఇవాళ జరగనున్నాయి.