హైదరాబాద్: 28°C
వార్తలు

యువతకు అన్యాయం జరుగుతోంది: బీజేపీ

TG: కాంగ్రెస్ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి.. సీఎం రేవంత్‌ రెడ్డిని డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ నిరుద్యోగుల్లో గందరగోళం నింపిందని విమర్శించారు. జీవో 46 వల్ల HYD పరిసరాలకే ఎక్కువ పోస్టులు దక్కుతున్నాయని, గ్రామీణ, వెనుకబడిన జిల్లాల యువతకు అన్యాయం జరుగుతోందని, తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలన్నారు.