TG: 'ఎన్నికలు వద్దు- విలీనమే ముద్దు' అనే నినాదంతో ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీన చట్టాన్ని వెంటనే అమలు చేయాలని జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. అసెంబ్లీ, గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ వచ్చినా, అపాయింటెడ్ డే ప్రకటించకుండా యూనియన్ ఎన్నికలు నిర్వహించడం చట్టవిరుద్ధమని మండిపడింది. ఈ మేరకు తక్షణమే జీవో విడుదల చేయాలని పలు యూనియన్ల నేతలు కోరారు.
వార్తలు
'ఎన్నికలు వద్దు- విలీనమే ముద్దు': RTC JAC


