హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది: తలసాని

TG: బీఎల్‌వోలకు శిక్షణ, సరిపడా సిబ్బంది, ఫారాలు లేకపోవడంతో రాష్ట్రంలో SIR ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 5 శాతం కూడా ఈ ప్రక్రియ జరగలేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పది ఇళ్లకు ఒక అధికారిని నియమించి ఎస్ఐఆర్‌ను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.