హైదరాబాద్: 28°C
వార్తలు

రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: కూనంనేని

TG: పేదల గుడిసెలను కూల్చితే ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టదని MLA కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ఇందిరాపార్కు వద్ద వామపక్షాల మహా ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకోకుండా, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమన్నారు. కబ్జాకోరులను జైల్లో పెట్టాలని, ఖమ్మం సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.