హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆహార కల్తీ, మాదకద్రవ్యాల నిరోధానికి ఒకే విభాగం'

TG: ఆహార కల్తీ, మాదకద్రవ్యాల నిరోధానికి ఒకే విభాగం ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ ప్రతిపాదించారు. HYDలో ఆహార కల్తీ కట్టడికి ఏర్పాటు చేసిన H-FAST బృందం అద్భుత ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ తన మొదటి 100 రోజుల్లోనే ఏకంగా 185 కేసులు నమోదు చేసి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే 121.87 టన్నుల ప్రమాదకరమైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుందని వెల్లడించారు.