హైదరాబాద్: 28°C
వార్తలు

రాయవరం ఎంపీడీవోని కలిసిన బీజేపీ నాయకులు

E.G: అనపర్తి మండలం రాయవరంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చింతా తమిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సోమవారం ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీడీవోకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పరస్పర సమన్వయంతో పనిచేయాలని నాయకులు కోరారు.