హైదరాబాద్: 28°C
వార్తలు

9 కీలక ఖనిజ బ్లాకుల వేలం రద్దు

పెట్టుబడిదార్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 9 కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల వేలాన్ని రద్దు చేసింది. ఏడో విడతలో భాగంగా నిర్వహించిన ఈ వేలంలో అర్హత గల బిడ్డర్లు ముందుకు రాకపోవడమే దీనికి కారణం. సాంకేతిక సంక్లిష్టతలు, అధిక పెట్టుబడి వ్యయాలు, నిబంధనల్లోని అనిశ్చితి వల్లే ప్రైవేటు సంస్థలు బిడ్డింగ్‌కు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.