హైదరాబాద్: 28°C
వార్తలు

'మౌలిక సదుపాయాలు కల్పించాలి'

SKLM: హిరమండలం దళిత వీధిలో పారిశుద్ధ్య, మౌలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా దళిత వీధిలో మురికినీరు, చెత్తతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తాగునీటి సమస్య కూడా ఉందని తెలిపారు.