హైదరాబాద్: 28°C
వార్తలు

చెరువులో పడి యువకుడి మృతి

NZB: మోస్రా మండల కేంద్రంలో సోమవారం ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన లక్ష్మణ్ (25) కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. కాలకృత్యాల కోసం చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందినట్లు వర్ని పోలీసులు తెలిపారు.