హైదరాబాద్: 28°C
వార్తలు

తాజ్‌మహల్‌పై హైకోర్టు కీలక విచారణ

తాజ్‌మహల్ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ చేపట్టింది. తాజ్‌మహల్‌ను హిందూ దేవాలయంగా ప్రకటించాలా? వద్దా అన్న అంశంపై విచారించింది. ఈ సందర్భంగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ మహల్‌పై సర్వే జరపాలా? వద్దా అనే దానిపై వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు భారత పురావస్తు శాఖకు నోటీసులు పంపించింది.