గుజరాత్ భావ్‌నగర్ జిల్లా గరాజియా గ్రామంలో ఊహించని ఘటన జరిగింది. పొదల్లో దాక్కున్న సింహం అకస్మాత్తుగా ఓ పశువుల కాపరిపై దాడి చేసింది. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తమై పెద్దగా కేకలు వేయడంతో సింహం అడవిలోకి పారిపోయింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
పశువుల కాపరిపై సింహం దాడి


