హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీకి ఎస్కార్ట్‌గా వైమానికదళం

ఇండోనేషియా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి అరుదైన గౌరవం లభించింది. మోదీని ఆ దేశం ప్రత్యేకంగా స్వాగతించింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం జకార్తా గగతనలంలోకి ప్రవేశించగానే.. ఆ దేశ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా వచ్చాయి. అనంతరం మోదీ విమానాశ్రయానికి చేరుకోగానే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్వాగతం పలికారు. ఎస్కార్ట్ వీడియో SMలో వైరల్ అవుతోంది.