హైదరాబాద్: 28°C
వార్తలు

కేజీబీవీలో ఎమ్మెల్యే పరిటాల సునీత తనిఖీలు

సత్యసాయి: రామగిరిలోని కస్తూరిబా బాలికల పాఠశాలను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి భోజన వసతులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం 1.25 కోట్ల రూపాయల ఎస్ఎస్ఏ నిధులతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల భవన పనులను పరిశీలించారు.