PPM: సాలూరులో జూలై 11న నిర్వహించనున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. రక్తదానం మహాదానమని, అత్యవసర పరిస్థితుల్లో అనేక మంది ప్రాణాలను కాపాడేందుకు రక్తదాతల సహకారం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొని సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు.
వార్తలు
జూలై 11న రక్తదాన శిబిరం


