హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి'

ASR: చింతపల్లిలో సోమవారం సీఐ సింహాచలం, ఎస్సై వీరబాబు స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. లైసెన్స్ లేకుండా ఆటోలు నడపరాదన్నారు. ప్రతి ఆటోకు అన్ని పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించకూడదన్నారు. డ్రైవర్ పక్కన విద్యార్థులను కూర్చోబెట్టరాదన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.