హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో 95% ఫారాల పంపిణీ పూర్తి: కలెక్టర్

MDK: జిల్లాలో ఓటరు జాబితా సవరణ (SIR)లో భాగంగా ఇప్పటివరకు 95 శాతం ఫారాల పంపిణీ పూర్తయిందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ పరిధిలో 2,20,427 మందికి గాను 2,07,487 మందికి, నర్సాపూర్‌లో 2,32,713 మందికి గాను 2,23,004 మందికి పంపిణీ చేశామన్నారు. మరో రెండు రోజుల్లో మిగిలిన ఫారాల పంపిణీని వంద శాతం పూర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.