హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.851 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ 30వ డివిజన్ కొత్తూరు రాజీవ్ స్వగృహలో రూ. 2.80 కోట్లతో కాంపౌండ్ వాల్, పంపులు, 500 కెఎల్ వాటర్ ట్యాంక్ పనులకు TDP రాష్ట్ర అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో రూరల్ నియోజకవర్గానికి రూ. 851 కోట్ల అభివృద్ధి నిధులు వచ్చాయని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.