హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టర్ కార్యాలయం ముందు కౌన్సిలర్ నిరసన

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలోని 8వ వార్డుకు మంజూరైన 40 లక్షల HMDA నిధులతో పనులు వెంటనే చేపట్టాలని కౌన్సిలర్ శ్రీకాంత్, సురేష్ ఆధ్వర్యంలో కాలనీవాసులు ఇవాళ కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు వినతి పత్రం సమర్పించారు. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.