హైదరాబాద్: 28°C
వార్తలు

అబార్షన్‌పై హైకోర్టు సంచలన తీర్పు

అబార్షన్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గర్భాన్ని కొనసాగించాలా లేదా గర్భస్రావం చేయించుకోవాలా అనే పూర్తి నిర్ణయం మహిళలదేనని తేల్చి చెప్పింది. ఇందుకోసం భర్త అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. మహిళ కోరిక మేరకు పూర్తి భద్రతా ప్రమాణాలతో ఆమెకు చికిత్స అందించి గర్భాన్ని తొలగించాలని వైద్యులకు సూచించింది.