హైదరాబాద్: 28°C
వార్తలు

'సర్' క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి'

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక క్యాంపును ప్రజలు వినియోగించుకోవాలని గ్రామ శాఖ అధ్యక్షుడు నీలకంఠం లింగస్వామి కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని, ప్రజలు బీఎల్ఓల సూచనల మేరకు పూర్తి సమాచారంతో ఫారాలను అందజేయాలని, బీఎల్ఎ‌లు కూడా సహకరించాలని కోరారు.