హైదరాబాద్: 28°C
వార్తలు

'పహల్గామ్ ఉగ్రదాడి'.. ఛార్జిషీట్‌లో LeT చీఫ్ పేరు

పహల్గామ్ ఉగ్రదాడి కేసుకు చెందిన అనుబంధ ఛార్జిషీట్‌లో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ పేరును NIA చేర్చింది. 2025 ఏప్రిల్‌ 22న JKలోని పహల్గామ్‌లో పర్యాటకులపై ముష్కరులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారు. అనంతరం భారత్ 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాక్‌లోని ఉగ్రమూకల క్యాంపులను ధ్వంసం చేసింది.