హైదరాబాద్: 28°C
వార్తలు

దలైలామాకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

టిబెటిన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామా అందించిన శాంతి, సామరస్య సందేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు 'మార్గదర్శకంగా' ఉన్నాయని ప్రశంసించారు. దలైలామా ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు. కాగా, గతేడాది మోదీ శుభాకాంక్షలు తెలిపిన వేళ చైనా నిరసన తెలపడం గమనార్హం.