హైదరాబాద్: 28°C
వార్తలు

బొడ్రాయి పండుగకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

NLG: కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామంలో బొడ్రాయి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇవాళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.