హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

పశ్చిమ బెంగాల్‌లోని 3 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ను EC విడుదల చేసింది. జూలై 24న పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించింది. ఎన్నికల అధికారులు రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈనెల 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. TMC నేతలు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాష్ చిక్ బరాయిక్‌ రాజీనామాతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి.