హైదరాబాద్: 28°C
వార్తలు

ఎట్టకేలకు చిక్కిన పెద్దపులి

మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో అటవీశాఖ అధికారులు పెద్దపులిని పట్టుకున్నారు. వారం రోజుల క్రితం చోర్‌గావ్‌కు చెందిన సంజయ్ అనే యువకుడిపై పులి దాడి చేయడంతో మృతిచెందాడు. అదే గ్రామ శివారులో ఉన్న పులిని అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు. షూటర్ ద్వారా మత్తు ఇచ్చి బంధించారు. ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పులిని బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.